12-12-2025 01:47:15 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
సుంకాల ఉద్రిక్తతల మధ్య వాణిజ్యం బలోపేతంపై చర్చ
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: సుంకాల ఉద్రిక్తతల మధ్య వాణిజ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో చిర్చంచారు. అంతేకాకుండా వారు వివిధ ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై సమాలోచనలు చేశౠరు. ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి, ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి రెండు దేశాలూ సహకరించుకోవడంపై వారు అంగీకరించారు.
భారత్, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వాషింగ్టన్, భారత్ మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షించారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం స్థిరంగా బలోపేతం కావడం పట్ల ఇద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను సమీక్షించారు. 21వ శతాబ్దంలో భారతదేశం- యూఎస్ కాంపాక్ట్ (సైనిక భాగస్వామ్యం కోసం ఉత్ప్రేరక అవకాశాలు, వేగవంతమైన వాణిజ్యంతోపాటు సాంకేతికత) అమలుకు కేంద్రంగా ఉన్న కీలకమైన సాంకేతికతలు, శక్తి, రక్షణ, భద్రత, ఇతర ప్రాధాన్యతా రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
వివిధ ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలను ఇద్దరూ చర్చించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలూ కలిసి పనిచేస్తూనే ఉంటాయని మోదీ పేర్కొన్నారు. పుతిన్ భారత్ పర్యటన అనంతరం ట్రంప్ సంభాషించుకోవడం ఇదే తొలిసారి.