calender_icon.png 12 December, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్ షా ఆందోళనగా కనిపించారు

12-12-2025 01:48:43 AM

  1. చేతులు కూడా వణికాయి

ఏ ప్రశ్నకూ నేరుగా సమాధానం చెప్పలేదు

నేను చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చిద్దామంటే జవాబు లేదు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఆందోళనగా కనిపించారని, ఆయన ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో నిన్న జరిగిన చర్చలో అమిత్‌షా మాట్లాడిన సంగతి తెలిసిందే. అమిత్ షా ప్రసంగంపై గురువారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘బుధవారం అమిత్‌షా నిన్న కం గారుగా కనిపించారన్నారు. ప్ర సంగం సమయంలో అమిత్‌షా చేతులు వణుకుతూ కనిపించాయి. ఏ ప్రశ్నకు కూడా నేరు గా సమాధానం చెప్పలేదు.

అలాగే వేటికీ ఆధారం చూపించలేదు.మీడియా ముందు నేను చేసిన వ్యాఖ్యలన్నింటినీ పార్లమెంట్‌లో చర్చిద్దామని ఆయనకు సవాల్ విసిరాను. కానీ ఆయన నుంచి సమాధానం రాలేదు’. అని రాహుల్ అన్నారు. బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్‌షా 90 నిమిషా ల పాటు మాట్లాడారు. విపక్షనేత రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఓటు చోరీకి పాల్పడిన పార్టీ కాంగ్రెస్ అని, ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కారణం నాయకత్వ లోపమేనని దుయ్యబట్టారు. చరిత్ర గురించి తాము మాట్లాడితే కాంగ్రెస్‌కు కోపం వచ్చేస్తుందని, చరిత్ర లేకుండానే ఏ సమాజమైనా ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు.

రాహుల్‌పై కేంద్ర మంత్రి విమర్శలు

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాతున్నప్పుడల్లా రాహుల్ బయటకు వెళ్లిపోతారని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ విమర్శించా రు. రాహుల్ హిట్ అండ్ రన్ ఫార్ములా ను అనుసరిస్తున్నారని, ఇదేనా ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యమంటే? అని ప్రశ్నించారు. భవిష్యత్‌లోనైనా ఆ అలవాటును ఆయన మానేస్తారని ఆశిస్తున్నా అన్నారు.