12-12-2025 01:45:48 AM
1,950 కి పైగా సర్వీసులను నడుపుతున్నాం
ఇండిగో చీఫ్ విక్రమ్ సింగ్ మెహతా
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఇండిగో సంక్షోభానికి పూర్తిబాధ్యత ఆ విమానాసంస్థదేనని, ఇండిగో నిర్లక్ష్యమైన దుర్విధానంతోనే ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చిందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు అన్నారు. కొన్ని రోజులుగా ప్రయాణికులు ఎదుర్కొన్న తీవ్రమైన ఇబ్బందులపై ఇండిగో చైర్మన్ విక్రమ్ మెహతా మౌనం వీడి కస్టమర్లకు క్షమాపణ చెప్పిన ఒక రోజు తర్వాత మంత్రి ఈ ప్రకటన చేశారు. అజెండా ఆజ్‌తక్‌లో గురువారం మంత్రి మాట్లాడుతూ, ఈ అంతరాయాలకు ఇండిగో బాధ్యతారాహిత్యమే కారణమని తెలిపారు. ‘ఈ సంక్షోభం కేవలం ఇండిగో బాధ్యతారాహిత్యం వల్లే జరిగింది.
ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) మార్గదర్శకాల ప్రకారం కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండి ఉంటే వాటిని నివారించగలిగేది’ అని ఆయన అన్నారు. ఈ సమస్య ఇండిగో వైపు, వారి యాజమాన్యం వైపు నుంచి ఉందని మంత్రి పేర్కొన్నారు. నవంబర్ 2025లో అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనల ప్రకారం పైలట్ సిబ్బంది అవసరాలను ఇండిగో తప్పుగా అంచనా వేయడం వల్లే విమాన అంతరాయం ఏర్పడిందని మంత్రి గతంలో పేర్కొన్నారు.
ప్రయాణికులకు క్షమాపణలు
ఇండిగో చీఫ్ విక్రమ్ సింగ్ మెహతా ఇటీవలి సంక్షోభానికి వివరణాత్మక బహిరంగ క్షమాపణలు బుధవారం జారీ చేశారు. కొత్త పైలట్ అలసట నియమాలను తప్పించుకోవడానికి ఎయిర్లైన్ ఉద్దేశపూర్వకంగా సంక్షోభా న్ని ప్రేరేపించిందనే ఆరోపణలను గట్టిగా ఖండించారు. ఇండిగో కార్యకలాపాలను స్థిరీకరించిందని, 1,900 రోజువారీ సేవలను నడిపిందని,
కానీ కస్టమర్ నమ్మకాన్ని పునర్నిర్మించడం ‘మాటలపై కాదు, చర్యలపై ఆధారప డి ఉంటుంది’ అని ఆయన స్పష్టం చేశారు. భారత్ దేశీయ మార్కెట్‌లో 65 శాతానికి పైగా ఆధీనంలో ఉన్న ఎయిర్ క్యారియర్, రోజూ 1,950కి పైగా విమానాలను నడపాలన్నారు. దాదాపు 3లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.