04-12-2025 12:27:31 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం మూడోరోజు లోక్‌సభ కీలక బిల్లుకు వాయి స్ ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. దీంతో సిగరెట్లు, ఖైనీ, జర్దా వంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అధిక ఎక్సుజ్ సుంకం వి ధించే కేంద్ర ఎక్సుజ్ సవరణ బిల్లు 2025 కు మార్గం సుగమమైంది. చట్టం అమలులో కి వస్తే జీఎస్టీ కాంపన్సేషన్ (పరిహార) సెస్ విధింపు గడువు ముగిసిన తర్వాత కూడా కేంద్రం పొగాకు ఉత్పత్తులపై ఎక్సుజ్ సుంకం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది.
బిల్లుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇస్తూ.. పొగాకు ఉత్పత్తులపై వచ్చే ఎక్సుజ్ సుంకం రాబడిలో 41శాతం రాష్ట్రాలకూ భా గస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఇది కొత్త పన్ను కాదని, జీఎస్టీకి ముందున్న ఎక్సుజ్ డ్యూటీ మాత్రమే మళ్లీ కేంద్రానికి బదిలీ అవుతోందని స్పష్టం చేశారు. బిల్లు ద్వారా దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గే అవకాశం ఉంటుందన్నారు.
పొగాకు సాగు చేసే రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. 2018 మధ్య పొగా కు పండించే రైతులు 45 వేల హెక్టార్లలో ఇతర పంటలు పండించారని, ఆ జాబితాలో తెలంగాణతో పాటు మొత్తం 10 రాష్ట్రాలు ఉన్నాయని వివరించారు. మరోవైపు ఈ బిల్లుపై పలువురు డీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లుతో బీడీ తయారీ పరిశ్రమలు కుదేలవుతాయని పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు.
పెద్దల సభలో
రాజ్యసభలో నీటి కాలుష్య నివారణ చట్టం సవరణ బిల్లును మణిపూర్‌కు విస్తరించాలనే తీర్మానంపై సభ్యులు చర్చించారు. అక్కడ రాష్ట్రపతి పాలన ఉన్నందున అక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని పలువురు సభ్యులు డిమాండ్‌చేశారు. ఉభయసభల నిర్వహణ తర్వాత సమావేశాలు గురువారం ఉదయం 11 గంటల వరకు వాయిదా పడ్డాయి.
పలు అంశాలపై విపక్షాల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అలాగే ఢిల్లీలో వాయు కాలుష్యానికి నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు మాస్క్‌లు ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. ఢిల్లీలో వాయు కాలుష్య నివారణ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.