calender_icon.png 4 December, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొరాయించిన చెక్‌ఇన్ సిస్టమ్

04-12-2025 12:25:33 AM

  1. దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్యలు
  2. శంషాబాద్ పరిధిలో 19 విమాన సర్వీసులు రద్దు
  3. ప్రయాణికుల అవస్థలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల చెక్-ఇన్ సిస్టమ్స్‌లో బుధవారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో స్పుసైజెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆపరేషనల్ సమస్యలతో ఇండిగో విమానయాన సంస్థ ఏకంగా 42 విమానాలను రద్దు చేసింది. మరికొన్ని చోట్ల ఆలస్యంగా విమాన సర్వీసులు నడిచాయి. దీంతో శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విమానాశ్రయ అధికారులు మైక్రోసాఫ్ట్ విం డోస్ సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశామని ప్రకటించారు. కొన్నిచోట్ల అధికారులు మాన్యువల్‌గా చెక్-ఇన్ ప్రక్రియ చేయించి ఫ్లుట్లై రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సాంకేతిక సమస్యల ప్రభావం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌పైనా పడింది. గోవా, అహ్మదాబాద్, మదురై, బెంగళూరు, దిల్లీ, భువనేశ్వర్, చెన్ను నుంచి శంషాబాద్‌కు రావాల్సిన 12 విమానాలు, ఇక్కడి నుంచి ఢిల్లీ, మదురై, బెంగ ళూరు, గోవా, కోల్‌కతా, భువనేశ్వర్‌కు వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దయ్యాయి.

దీంతో ప్రయాణికులు తీవ్రమైన అవస్థలు ఎదుర్కొన్నారు. హెల్ప్‌డెస్క్‌ల వద్ద గుమిగూడి ఫ్లుట్లై పునరుద్ధరణపై ఆరా తీశారు. అలాగే బెంగళూరు విమానాశ్రయంలోనూ నాలుగు విమానాలు ఆలస్యంగా బయల్దేరాయి. మరోవైపు థర్డ్‌పార్టీ సాయంతో తమ సర్వీసులను పునరుద్ధరించామని ‘ఎయిర్ ఇండియా’ ప్రకటించింది. సాంకేతిక సమస్య లు, రద్దీ కారణంగా తమ సర్వీసులు రద్దయ్యాయని, ప్రయాణికులు టిక్కెట్ బుకింగ్ సొమ్మును రీఫండ్ చేస్తామని ‘ఇండిగో’ స్పష్టం చేసింది.