బిల్లులకు మద్దతు ఇవ్వాలి: మోదీ
18-04-2026 01:38 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౭: మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాలని ప్రధాని మోదీ విపక్షాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రధాని ప్రసంగిస్తూ.. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ చారిత్రాత్మక బిల్లులకు ఏకగ్రీవంగా మద్దతు పలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి దేశ హితం కోసం ప్రతిపక్షాలు కలిసి రావాలని విన్నవించారు.






