22 August, 2026 | 11:08 PM

చెంజర్లలో టాస్క్ ఫోర్స్ దాడులు

22-08-2026 10:25 PM

169 జిలేటిన్ స్టిక్స్,15 డిటోనేటర్స్ పట్టివేత

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో శనివారం స్థానికుడైన గొల్లెన అనిల్ ఇంటిలో 169 జిలెటిన్ స్టిక్స్, 15 డిటోనేటర్స్ స్వాధీనపరచుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి సతీష్ కుమార్ చెప్పారు. అనిల్ ని విచారించగా సంపంగి శ్రీనివాస్ అనే వ్యక్తి  సరఫరా చేసినట్లు తెలిపారని, తదుపరి విచారణ నిమిత్తం అనిల్ ను, ఇతని వద్ద లభ్యమైన పేలుడు పదార్థాలను మానకొండూరు పోలీసులకు అప్పగించామని ఆయన వివరించారు.ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షించబడతారని టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీష్  హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ మామిడాల సురేందర్ మీడియాకు వివరాలు అందించారు.