14 July, 2026 | 3:18 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

బాస్‌కు బర్త్‌డే విషెస్

26-06-2024 12:05 AM

‘నువ్విలా’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన హవీష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎస్ బాస్’. కాంచన కోనేరు సమర్పణలో రానున్న ఈ సినిమాకి ‘భాగమతి’ ఫేమ్ జి.అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వగా, మంగళవారం హవీష్ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘సెవన్’,  ‘రామ్ లీల’, ‘జీనియస్’ వంటి చిత్రాలతో తన సినీ ప్రయాణం సాగిస్తున్న హవీష్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ‘ఎస్ బాస్’ సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె స్టూడియోస్ బ్యానర్‌పై ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ వంటి చిత్రాలను నిర్మించిన కొనేరు సత్యనారాయణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ రచయిత ఆకుల శివ కథ, మాటలు అందిం చిన ఈ సినిమాకి కబీర్ లాల్ ఛాయాగ్రహణం సమకూర్చుతుండగా, అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు.