17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక
ఆదిలాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన అండర్ 16, 19, సీనియర్స్ ఆదిలాబాద్ జిల్లా జట్లను జిల్లా కేంద్రంలోని VNR క్రికెట్ అకాడమీ మైదానంలో ఎంపిక చేస్తున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీ నరోత్తం రెడ్డి తెలిపారు. మంగళ వారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన అండర్-16 బాలురు, అండర్-19 బాలురు, సీనియర్స్, అండర్-19 బాలికలు, సీనియర్ మహిళలు ఉదయం 9.30 గంటలకు మైదానంలో హాజరై రిపోర్ట్ చేయాలన్నారు. ఎంపికైన జట్లు త్వరలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే అంతర్ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు 95533 33391, 94402 22981లలో సంప్రదించవచ్చన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు యూసుఫ్ ఖాన్, డాక్టర్ కీమ శ్రీనివాస్, అమిత్ దోక్వల్, రమేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






