2 May, 2026 | 10:10 PM

అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం

02-05-2026 09:05 PM

రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి

భద్రాచలం(విజయ క్రాంతి): భద్రాచలం పట్టణ ప్రజలకు అడవులలో దొరికే అటవీ ఉత్పత్తులు, సేంద్రియ ఆర్గానిక్ ఉత్పత్తులు, ఎస్ హెచ్ జి, గిరిజన మహిళలకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఎంతో దూర దృష్టితో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్  కృషితో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పిఓ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శనివారం నాడు భద్రాచలం పట్టణంలోని భద్రగిరి మార్ట్ ను మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మరియు ఇతర అధికారులతో కలిసి ఆయన సందర్శించి మార్ట్ లోని అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన అనేక అటవీ వస్తువులను ఈ మార్ట్ లో అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమని, ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఎస్ హెచ్ జి గిరిజన మహిళలు మరియు ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ను కల్పించడంతోపాటు స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్ని అందించే సదాశయంతో ఏర్పాటు చేసిన ఈ మార్టును స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని,

భద్రగిరి మార్ట్ లో అందుబాటులో ఉంచిన గిరిజనుల సాంప్రదాయ ఉత్పత్తులు, వారి ప్రతిభకు సరైన గుర్తింపు ఇవ్వడం, అలాగే వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ మార్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, భద్రాచలం ప్రజలు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి, గిరిజన ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు, గిరిజన రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలని ఆయన అన్నారు. అనంతరం భద్రగిరి మార్ట్ ఆవరణలో మహిళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ మహామారి నిర్మూలన సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ మరియు ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.