29 August, 2026 | 12:37 AM

అంకితభావంతో పనిచేయాలి

16-06-2026 05:04 PM

- బెల్లంపల్లి, కాసిపేట పీఎస్ లను తనిఖీ చేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాసిపేట పోలిస్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంగళవారం తనిఖీ చేశారు. తొలుత  ఆయన కాసిపేటలో పర్యటించారు. మహిళల భద్రత కోసం షీ టీం ఎస్సై ఉషారాణి చేపట్టిన అవగాహన  కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను సీఐ హనుక్‌ను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలో రోజువారీగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులను పరిశీలించి,రూరల్ సర్కిల్ కార్యాలయ పరిధిలో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, కేసుల దర్యాప్తు పురోగతికి సంబంధించిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

అంకితభావంతో విధులు నిర్వహించాలి

బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కీలక సూచనలు చేశారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలని, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి పోలీసు అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

- పోలీసులు విధులను అంకితభావంతో చేయాలి

పోలీసులు విధులను అంకితభావంతో చేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రేవ్ కేసుల్లో జాప్యం లేకుండా నిందితులను త్వరితగతిన అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచాలని తెలిపారు. విచారణ, దర్యాప్తు సమయంలో భౌతిక సాక్ష్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను కూడా వినియోగించాలన్నారు.నేరాల నియంత్రణ, దొంగతనాల నిర్మూలన కోసం అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన పెట్రోలింగ్ నిర్వహించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు.

సీసీటీవీలు, సైబర్ నేరాలపై అవగాహన పెంచాలి

నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు అందజేసే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు భద్రత, భరోసా కల్పించే విధంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్-100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.  పోలీసు అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ తనిఖీలలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఏమన్నారు?

రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీలో పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని అధికారులకు సూచించారు.

FAQ's

1. బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎవరు తనిఖీ చేశారు?

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ నిర్వహించారు.

2. తనిఖీలో ప్రధానంగా ఏ అంశాలను సమీక్షించారు?

పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలను సమీక్షించారు.

3. సీపీ పోలీసులకు ఏ సూచనలు చేశారు?

ప్రజలకు అందుబాటులో ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.


RELATED ARTICLES......

బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా రాజేశ్వర్

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం

బెల్లంపల్లిలో హత్య కలకలం

బెల్లంపల్లిలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

బెల్లంపల్లి ఆసుపత్రి ఎదుట..

ప్రతిరోజూ బెల్లంపల్లికి తాగునీరు