calender_icon.png 14 December, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళలో బీజేపీ చారిత్రక విజయం

14-12-2025 01:41:50 AM

  1. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కైవసం

నగరంలో మొత్తం 101 డివిజన్లు ఉండగా 50 డివిజన్లలో హవా

త్రిపుణితుర, పాలక్కాడ్ మున్సిపాలిటీలూ బీజేపీ పరం!

త్రివేండ్రం, డిసెంబర్ 13: కేరళ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్‌లో 45 ఏళ్లుగా సాగుతున్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 101 డివిజన్లు ఉండగా, ఎన్డీయూ కూటమి 50 డివిజన్లలో గెలిచి సత్తా చాటింది. ఎల్డీఎఫ్ కేవలం 29 డివిజన్లకే పరిమితమైంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) 19 స్థానాల్లో గెలిచింది. మరో రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

ఒక వార్డులో అభ్యర్థి మరణం కారణంగా పోలింగ్ రద్దయింది. మొత్తంగా ఎన్డీయే కూటమి విజయం బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. త్రివేండ్రం లోక్‌సభ స్థానానికి ఎంపీగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇలాకా అయిన మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ సత్తా చాటడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

త్రిపుణితుర, పాలక్కాడ్‌లో విజయం

ఎన్డీయే కూటమి ఒక్క త్రివేండ్రానికే పరిమితం కాకుండా త్రిపుణితుర, పాలక్కాడ్ మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటింది. మున్సిపాలిటీలో మొత్తం 53 వార్డులు ఉండగా, ఎన్డీయే కూటమి 21 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. అలాగే ఎల్డీఎఫ్ 20 స్థానాల కు, యూడీఎఫ్ 12 స్థానాలకు పరిమితమయ్యాయి. ఈ మున్సిపాలిటీలో బీజేపీ ఎక్కు వ స్థానాలు గెలుచుకోవడం చరిత్రలో ఇది మొదటిసారి. పాలక్కాడ్ మున్సిపాలిటీలో నూ ఎన్డీయే కూటమి పైచేయి సాధించింది. ఇక్కడ 52 వార్డులు ఉండగా, 28 వార్డుల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.

ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం

కేరళలో మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, త్రివేండ్రం ఎంపీ శశిథరూర్ ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్డీయే కూటమి ఆఖండ విజయం సాధించడం అభినందనీయమన్నారు. ప్రజాతీర్పును తాము గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూడా ఎక్కువ స్థానాలనే గెలుచు కుందని , విజేతలకు అభినందనలు తెలుపుతున్నామని తెలిపారు.

ఓటర్లకు కృతజ్ఞతలు: మోదీ

‘కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో విజయం మా పార్టీ విజయం గొప్ప సంతోషాన్నిచ్చింది. ఇది చారిత్రక విజయం. ఎన్ని కల చరిత్రలో ఇది ఒక మైలురాయి. మాపై నమ్మకం వుంచి గెలిపించిన ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.

త్రివేండ్రం అభివృద్ధికి కృషి చేస్తాం. ఎన్నికల్లో గెలిచిన వారంతా నిబద్ధతతో పనిచేస్తారు. నగరవాసులకు మెరుగైన వసతులు కల్పించేందుకు శాయశక్తులా పనిచేస్తారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు నా అభినందనలు’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు.