calender_icon.png 14 December, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడివాడలో భారీ అగ్నిప్రమాదం

14-12-2025 07:57:48 AM

గుడివాడ: కృష్ణా జిల్లా( Krishna district) గుడివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వాణిజ్య దుకాణాల సముదాయంలో మంటలు(Fire Accident) చెలరేగాయి. గుడివాడలోని నెహ్రూచౌక్ సెంటర్(Nehru Chowk Center)లో ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్ లోని బట్టల దుకాణాల్లో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. భారీ మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.