దేశంలో మోదీ మేనియా
వంశపారం పర్యం కాదు.. వంద కోట్ల విశ్వాసం
వరంగల్ చౌరస్తాలో బీజేపీ శ్రేణుల సంబరాలు
వరంగల్,(విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయం ప్రజాస్వామ్యానికే గర్వకారణమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్, టీఎంసీ కూటమి కుట్రల రాజకీయాన్ని ప్రజలు తిప్పికొట్టి, బీజేపీకి ఘన విజయం కట్టబెట్టారని కొనియాడారు.
ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం, విజయాలు ఖాయం కావడంతో వరంగల్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు పండగ వాతావరణం నెలకొల్పాయి. గంట రవికుమార్ ఆధ్వర్యంలో బాంబులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డాకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ అచంచలమైన నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.






