4 May, 2026 | 10:44 PM

హరీష్ రావుపై బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి

04-05-2026 09:29 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, పాపట్ల నరహరి అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మను  బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... 6 సార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్ శాఖ, ఆర్థికశాఖ, వైద్యారోగ్యశాఖ మంత్రిగా రాష్ట్రానికి సేవ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హోదాను మరిచి, అదిష్టానం మెప్పుకోసం నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఇప్పటివరకు వరిధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో 30 శాతం వడ్లను కొనుగోలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో రైతులే కర్రకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారని అన్నారు. బీర్ల అయిలయ్య వెంటనే హరీశ్రావుకు క్షమాపణలు చెప్పాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో    సతీష్ యాదవ్, గ్యాదపాక క్రాంతి, బండి వాసు, దండబోయిన వీరేష్, వాసం రమేష్ తదితరులు పాల్గొన్నారు.