14 April, 2026 | 1:21 PM

Breaking News

సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •  

ఓటమెరుగని సునీల్ కు అండగా 42వ డివిజన్ వాసులు

07-02-2026 12:16 AM

కరీంనగర్ 42వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

కరీంనగర్ క్రైం ,ఫిబ్రవరి6(విజయక్రాంతి): ఓటమెరుగని సునీల్ కు 42 వ డివిజన్ వాసులు అండగా నిలుస్తున్నారు. ఈ నెల 11 న జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో 42వ డివిజన్ బీజేపీ అభ్యర్థి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. డివిజన్‌లో అన్నివర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సేవలందిస్తానని అన్నారు. స్థానిక 42వ డివిజన్‌లో మేయర్‌గా అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. డివిజన్‌లో ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర నిధులు తీసుకువస్తున్నారని తెలిపారు. మీ ఆశీర్వాదం వల్ల వరుసగా గెలుస్తున్నానని మరో మారు సేవచేసే భాగ్యం కల్పించాలని ఆయన ఓటర్ల ను కోరారు.