15-11-2025 12:00:00 AM
కొండాపూర్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో శుక్రవారం కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. సీఎం రేవంత్రెడ్డి పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన సరైన తీర్పు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చెర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చెర్మన్ కుమార్, మాజీ ఎంపీటీసీ నర్సింహా రెడ్డి, జనరల్ సెక్రటరీ నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాసు, సునీల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు, నాయకులు మాణిక్ రెడ్డి, గోపాల్, మన్సుర్, రఘురామ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.