పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
నేర నియంత్రణలో నిర్లక్ష్యానికి తావులేదు: ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ క్రైం, జూన్ 11 : పెండింగ్ కేసు ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో న మోదైన గ్రేవ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రతి కేసులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, ప్రధాన కూడళ్లలో అధిక సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటు జరిగేలా ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాలు, వ్యాపార వర్గాల సహకా రం తీసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాలు నేరస్తులను గుర్తించడంలో, కేసుల ఛే దనలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పా టించాలని, శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ డేటా సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, ఆలస్యం లేకుండా చట్టపరమైన నిబంధనల ప్రకారం సమయానికి చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కోర్టు అధికారులతో సమన్వ యం చేసుకుంటూ ప్రతి కేసుకు సంబంధించి సీసీ నంబర్లు తీసుకోవాలని సూచిం చారు. మాన్యువల్ రికార్డులు, సీసీటీఎన్‌ఎస్ నమోదుల మధ్య ఉన్న వ్యత్యాసాలను వెం టనే సరిచేయాలని తెలిపారు.
డేటా నమోదులో నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించా రు. దీనివల్ల కోర్టులపై భారం తగ్గడంతో పా టు ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు పెరు గుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృత స్థా యిలో అవగాహన కల్పించాలని సూచించా రు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని, ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా సమాచారాన్ని అందించాలని ప్రజలకు తెలియజేయాలన్నారు. మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రౌడీ షీటర్ల ప ర్యవేక్షణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, గంజా యి, మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహిం చాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాం రెడ్డి, రాజశేఖర రాజు, సిబ్బంది పాల్గొన్నారు.






