calender_icon.png 20 January, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం

20-01-2026 01:19:26 AM

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

నిర్మల్, జనవరి ౧9 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు  చీకటి ఒప్పందంతో  పనిచేస్తున్నాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు  నిర్మల్ పట్టణ బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలతో మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. జాతీయ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేవలం బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో రాకుండా కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. నిర్మల్ మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని, నిర్మల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉందని ప్రజలు సైతం బీఆర్‌ఎస్ వైపే ఉన్నారన్నారు. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి రాంకిషన్, పట్టణ అధ్యక్షులు రాము  పాటు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.