calender_icon.png 20 January, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాలకు రుణాల పంపిణీ

20-01-2026 01:20:31 AM

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి 

నిర్మల్, జనవరి ౧9 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని  రుణాలు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాలకు పంపిణీ చేశారు రూ.2,72,16,714/- కోట్ల చెక్కును అందించి వారిని అభినందించారు. మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నిర్మల్ పట్టణానికి చెందిన మహిళా  సంఘాలకు అందించారు. ఈ వడ్డీ లేని రుణా లను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, మహిళా సంఘాలు పాల్గొన్నారు.