12 May, 2026 | 11:52 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

సెక్యులర్ ఓట్ల తొలగింపుకు బీజేపీ కుట్ర

28-04-2026 12:59 AM
  1. బీఎల్‌ఏల నియామకం చేపట్టాలి 
  2. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలి 
  3. పార్టీ కోసం పనిచేసిన వారికి త్వరలో పదవులు 
  4. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఇందిరాభవన్‌లో డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో జరిగిన  సమావేశం లో మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీఎల్‌ఏల నియామకం, జిల్లా, మండల కమిటీల ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా మహే శ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ తన కుటిల యత్నాల్లో భాగంగా తెలంగాణలో సెక్యులర్ ఓట్లను తొలగించే కుట్రచేస్తున్నదని మండిపడ్డారు. అడ్డదారుల్లో ఓట్లను గైర్హాజరు చేసేందుకు జరుగుతున్న ఈ కుట్ర ను అడ్డుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)ల నియామకం, పనితీరు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదన్నారు. ఇప్పటినుంచే బీఎల్‌ఏ కార్యక్రమం మొదలుకావాలని, క్షేత్రస్థా యిలో పార్టీ పటిష్టతకు బీఎల్ ఏలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తిం పు ఉంటుందని చెప్పారు. త్వరలోనే కార్పొరేషన్ పదవుల భర్తీ ఉంటుందని, పార్టీ శ్రేణు లకు ఇది తీపి కబురని, మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యకర్తలు, నాయకులు తమ సమయంలో 80 శాతం పార్టీ కోసం కేటాయించాలని కోరారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేయాలని సూ చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటేనే భవిష్యత్తు విజయాలు సాధ్యమవుతాయని పునరుద్ఘాటించారు.

జహీరాబాద్ నియోజకవర్గంపై సమీక్ష

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తో సోమవారం ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్  ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజక వర్గంలో బూత్ లెవల్ ఏజెంట్లు, మండల కమిటీల నియామకానికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు సమావేశంలో చర్చించారు. అలాగే పార్టీని అట్టడుగు స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజల పక్షాన పోరాడేందుకు ప్రతి కార్యకర్తను సిద్ధం చేయడమే మన ప్రాథమిక లక్ష్యం అన్నారు.