ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
మంగపేట, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా సోమవారం బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 2001 సంవత్సరంలో స్థాపించిన పార్టీ 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
పలు గ్రామాల్లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. మంగపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు బీఆర్‌ఎస్ పార్టీ ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా బాడిశ నాగ రమేష్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని కేసీఆర్ ముఖ్యమంత్రిగా అభివృద్ధియే లక్ష్యంగా 10 సంవత్సరాల పాటు ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి గొప్పపేరు తీసుకువచ్చారన్నారు.
గత ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, రానున్న ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. మండల వ్యాప్తంగా జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో బీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్, నాయకులు కోరం సంతోష్, గుడివాడ శ్రీహరి, నూనె లింగయ్య, తుక్కాని శ్రీనివాస్, రావుల రమణ, సింగనబోయిన నరసయ్య, కాటూరి సుగుణ, ఆయూబ్, ఇంతియాజ్ ( భుట్టో ), దంతనపల్లి నరేందర్, తిరుపతి, ఆయా గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






