calender_icon.png 11 February, 2026 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మంత్రి వేధింపులు భరించలేక బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మృతి

11-02-2026 12:00:00 AM

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి):కాంగ్రెస్ మంత్రి వేధింపులు భరించలేక బిజెపి మక్తల్ మున్సిపల్ ఎన్నికల 6వ వార్డు అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎరుకలు మహదేవప్ప అనువదస్పదంగా మృతి చెందడం పట్ల బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అత్యంత విషాదకరం అని అన్నారు.జిల్లా కేంద్రంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మాఫియా రాజకీయాలు నిరంతరం బెదిరింపుల మధ్య 6వ వార్డు అభ్యర్థి బిజెపి ఎరుకల మహదేవప్ప అనువాదస్పదంగా మృతి చెందడం అత్యంత విషాదకరం గత కొంతకాలంగా స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి నుంచి మహాదేవప్పపై తీవ్ర వేధింపులు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు స్థానికులు ఆరోస్తున్నారు.

ఈ మానసిక ఒత్తులను తట్టుకోలేకనే ఉదయం నాలుగు గంటల సమయంలో మహదేవప్ప మృతి చెందినట్లు సమాచారం ఇది ఆత్మహత్య ? లేక మరెదేమైనా కారణమా అన్నది పూర్తిస్థాయి పోలీస్ విచారణలో తేలాల్సిన విషయం కొంతకాలం క్రితం బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించిన కేవలం రెండు రోజుల్లోనే తిరిగి బిజెపిలో చేరి ఆరవ వార్డ్ అభ్యర్థిగా పోటీచేసిన నిబద్ధత కలిగిన కార్యకర్త మహదేవప్ప నిన్న మక్తల్ పట్టణంలో నిర్వహించిన బిజెపి ర్యాలీ ఘన విజయం సాధించడంతో ఓర్వలేక బిజెపి అభ్యర్థులకు ఫోన్ల ద్వారా బెదిరింపులు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ బెదిరింపుల మధ్యనే మహదేవప్ప అనువాదస్పద స్థితిలో మృతి చెందడం ప్రజలలో తీవ్ర ఆందోళనకు దారి తీస్తుంది ఈ ఘటనకు మంత్రి వాకిటి శ్రీహరి కారణమని మహదేవప్ప సతీమణి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం మరింత కలిసి వేసింది ఇలాంటి అహంకార రాజకీయ నాయకులను సభ్య సమాజం ప్రశ్నించాలి బాధ్యులపై వెంటనే హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసి నిష్పక్షపాత విచారణ జరపాలి ఒక రాజకీయ నాయకుడు వేధింపులకు ఒక నిండు ప్రాణం బలయింది ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి మహదేవప్పకు న్యాయం జరగాల్సిందే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు బిజెపి జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్ మ జిల్లా కౌన్సిల్ సభ్యులు చందుపట్ల లక్ష్మారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.