calender_icon.png 11 February, 2026 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలమైన శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్

11-02-2026 12:00:00 AM

ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): తెలంగాలో బలమైన శక్తిగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల బరిలో దిగామని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అం బటి జోజిరెడ్డి తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 31 స్థానాల్లో సింహం గుర్తుపై పోటీ చేస్తు న్న అభ్యర్థులు 26 చోట్ల గట్టి పోటీ ఇస్తుండడంతో ఏఐఎఫ్ బి పేరు ఈసారి మారుమ్రోగింది. గతం లో మాదిరిగా కాకుండా ఎన్నికల బరిలో దిగే అ భ్యర్థులకు పార్టీ సభ్యత్వం ఉంటేనే టికెట్ ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల తమ అభ్యర్థులు గెలిచి మేయర్, చైర్మన్ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారుతారని ఈ సందర్భంగా జోజిరెడ్డి తెలిపారు. అయితే కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీజేపీపై పోరాటం చేస్తుందని, ఈ క్రమంలో ఇక్కడ ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోమని, లౌకిక శక్తులతో పార్టీల ఫలితాల ఆధారంగా కలుస్తామని జోజిరెడ్డి వివరించారు.

గత కార్పొరేషన్ ఎన్నికల్లో రామగుండంలో అనూహ్య ఫలితాలు సాధించిన ఏఐఎఫ్ బి ఈసారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో పోటీకి దిగడం, జాగృతి అధ్యక్షురాలు కవిత అనుచరులు కూడా పార్టీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ గుర్తుపై బరిలో దిగడంతో పలుచోట్ల వీరి వల్ల ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి నెలకొనడంతో ఏఐఎఫ్ బి మరోమారు ఫోకస్ లోకి వచ్చింది. ఈ క్రమంలోనే జోజిరెడ్డి విజయక్రాంతితో మాట్లాడుతూ పై అంశాలను వివరించారు.