14-02-2026 06:55:15 PM
మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గా ముఖేష్ గౌడ్
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ నాయకులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లు ఘనంగా సన్మానించారు. శని వారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ లో విజయం సాధించిన 57వ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించిన గాజుల ముఖేష్ గౌడ్ తో పాటు 58వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన బోట్ల అనిత, నాలుగవ డివిజన్ కార్పొరేటర్ తోటపల్లి రాజేశ్వరి,
ఆరవ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేత రాకేష్ ను, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ఒకటవ వార్డు కౌన్సిలర్ గా విజయం సాధించిన బుద్దె సిద్దార్థని, చెన్నూర్ మున్సిపాలిటీలో 10వ వార్డు కౌన్సిలర్ గర్రెపల్లి శాంత రాణిని, 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణలని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా గాజుల ముఖేష్ గౌడ్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.