24 June, 2026 | 3:08 PM

Breaking News

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •   చీర్లవంచలో అరుణోదయ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ   •  

మక్తల్ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు

11-02-2026 02:40 AM

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): నారాయణపేట్ జిల్లా మక్తల్ ము న్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటనపై బీజేపీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఇతర నేతలు కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిని మంగళవారం కలిసి వినతిప త్రం సమపర్పించారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో ఎన్.రాంచందర్ రావు సమావేశమై మక్తల్ ఘటనను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పలువురు అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థులను వేధిస్తున్నారని, నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి తీసు కొచ్చారని రాంచందర్ రావు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.