3 July, 2026 | 5:28 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

మాజీ సర్పంచుల అరెస్టు అప్రజాస్వామికం

06-06-2025 07:53 PM

సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్(Sarpanch Association President Survi Yadaiah Goud) అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచ్లను అరెస్టు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్రజాస్వామికంగా మాజీ సర్పంచులను అరెస్టు చేశారని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి పరిష్కారం చూపకుండా అభివృద్ధి చేసిన సర్పంచుల ను అక్రమంగా అరెస్టు చేయడం అవివేకం అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రజల దృష్టిని మరల్చుతూ ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తున్న రేవంత్ రెడ్డి ప్రజలకు తప్పక సమాధానం చెప్పాలని అన్నారు. 

ప్రజా పాలనలో పథకాల అమలుకు నిధులు లేవని చెప్పిన ముఖ్యమంత్రి కొత్తగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేసి ఎవరిని మోసం చేస్తారని అన్నారు.ఇప్పటికైనా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాలని లేని యెడల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక  ఓటమి చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్రి నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం,గుడిమల్కాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధగోని శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల సంఘం మండల ఉపాధ్యక్షులు పాండురంగ నాయక్, మాజీ సర్పంచులు యాదవ రెడ్డి, కట్టెల బిక్షపతి, జక్కర్తి పాపయ్య, మన్నె పుష్పలత చిత్రసేనారెడ్డి, దోనూరు శేఖర్ రెడ్డి, జింకల ఫకీర్ తదితరులు పాల్గొన్నారు.