09-02-2026 12:40:11 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): స్థానిక సర్వేల ప్రకారం ఈ ఎన్నికల్లో బీజేపీ 1,900 సీట్లలో గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తూళ్ల వీరేందర్‌గౌడ్ జోస్యం చెప్పారు. బ్యాలట్ ద్వారా జరిగే ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బ్యాలట్ బాక్సులను ఎత్తుకుపోయి.. మాస్ రిగ్గింగ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉం డాలని పిలుపునిచ్చారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గత ఎన్నికల్లో బీజేపీ దాదాపు 400 కౌన్సిల ర్లను గెలిచిందని, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 36.5 శాతం ఓట్లు పోలయ్యాయని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. స్థానిక సర్వేల ప్రకారం ఈసారి 1,900 సీట్లలో బీజేపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. అదనంగా 600 సీట్లలో పోరా టం కొనసాగుతుందని, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో 60--65 శాతం మద్దతు బీజేపీకి ఉందన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే ట్యాక్సులు పెంచి భారం మోపడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, గతంలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని చెప్పి.. పురుషులపై బస్ చార్జీలభారం మోపారని గుర్తు చేశా రు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నీచరాజకీయాలకు బుద్ధిచెప్తామని హెచ్చరించారు. ముస్లింలకు 14 శాతం రిజ ర్వేషన్లను తీసుకురా వడానికి రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇదేనా బీసీలకు మీరు బీసీలకు చేసే న్యాయం?’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.