23 May, 2026 | 2:56 AM

బీజేపీ పోరుబాట

23-05-2026 01:41 AM

  25 నుంచి రైతు ఘోష.. కమలం పార్టీ భరోసా కార్యక్రమం

మూడురోజులపాటు పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్న పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): రాష్ట్రం లో పంట కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు బీజేపీ సన్నద్ధ మవుతోంది. ఇందుకు ఈనెల 25 (సోమవారం) నుంచి క్షేత్రస్థాయిలో పంట కొనుగోలు కేంద్రాలను సందర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పోరుబాటకు సిద్ధమవుతోంది.

మూడు రోజులపాటు పంట కొనుగోలు కేంద్రాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు ఎన్ రాంచందర్ రావుతోపాటు పార్లీ ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలిస్తారు. మొదటిరోజు రాంచందర్‌రావు సమక్షంలో కొనుగోలు కేంద్రాల్లో నేతలందరూ పర్యటిస్తారు. ఈ మూడు రోజుల పర్యటన వివరాలను శనివారం ప్రకటించనున్నారు.

బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు కలిసి రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలను పర్యటించి.. వడ్ల కొనుగోలు ఎంత జరిగింది? మొక్క జొన్న కొనుగోలు ఎంతవరకు జరిగింది? అన్న విషయాలను ప్రజల ముందుకు తీసుకు రానున్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు అధ్యక్షతన ప్రజాప్రతినిధులు బ్రేక్‌ఫాస్ట్ సమావేశం జరిగింది.

ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్‌తోపాటు పార్టీ సంస్థాగత ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ తివారి, ఎంపీ రఘునందన్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, పాల్వాయి హరీష్‌బాబు, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య పాల్గొని రాష్ట్రంలోని రైతు సమస్యలు, తాజా రాజకీయాలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం, భవిష్యత్ కార్యాచరణ, ఎస్‌ఐఆర్‌పై చర్చించారు.

పంటను అమ్ముకోలేని స్థితిలో రైతు..

ఎన్నికల మేనిఫెస్టోలో 10 పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈరోజు రైతులను మోసం చేస్తోందని, ప్రతి ఎకరానికి రూ.7,500 రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం లో వెల్లడించారు. ఇప్పు డు ‘రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకు నే సమయంలో కూడా ఒక బస్తాకు అదనంగా 4 కిలోలు కోత పెడుతున్నారు.

గన్నీ బ్యాగుల కోసం రైతులు వేచి ఉంటున్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు లేక రైతులు యార్డుల్లోనే కుప్పలు వేసుకుని అక్కడే కాపలా కాస్తున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయ త్నం. నిజంగా 80 శాతం కొనుగోళ్లు జరిగి ఉంటే, మీరు ఎక్కడికి తీసుకెళ్లినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మీరు మా వెంట రండి, తామే వాస్తవ పరిస్థితులు చూపి స్తాం.

రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 24 శాతం మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. సుమా రు 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తే, గత సంవత్సరం కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారు?. సీఎంమే 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు.

ఆయన లెక్కలనే నిజమని తీసుకున్నా కూడా అది 30- శాతం మాత్రమే అవుతుంది. మరి ఏ లెక్కలతో 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని చెబుతున్నారు?. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 24 శాతమే కొనుగోలు చేసింది. మేం కొనుగోలు కేంద్రాలను పర్యటిస్తాం’ అని చెప్పారు. 

ప్రతి చోట దోపిడీయే..

‘యూరియా బస్తాల దగ్గర నుంచి గన్నీ బ్యాగుల వరకు, పంట అమ్ముకునే దశ వర కు ప్రతిచోటా దోపిడీ జరుగుతోంది. మిల్లర్లు దోచుకుంటున్నారు, దళారులు దోచుకుంటున్నారు. చివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో కూడా ఒక బస్తాకు 4 కిలోల దోపిడీ జరుగుతోంది. అంటే రైతు పండించిన పంటలో 10 శాతం మాయమవుతోంది. అది ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?  90 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు జరిగితే, అందులో 10 శాతం అంటే 9 లక్షల  టన్నుల వడ్లు ఎవరిఖాతాల్లోకి వెళ్తున్నాయి?,

ఈ వేలకోట్ల దందా ఎవరి కోసం జరుగుతోంది? దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యంగా రైతు సమస్యలపై రైతులకు భరోసా ఇవ్వడానికి ఈ కార్యాచరణ రూపొందించాం. ౩ రోజుల పర్యటన అనంతరం తదుపరి కార్యాచరణ కూడా ౨ రోజుల్లో ప్రకటిస్తాం. రైత న్నకు భరోసా ఇవ్వడానికి మేం చేసే ఈ యా త్ర వారికి అండగా నిలుస్తుందని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. 

జూన్ మొదటివారంలో నితిన్ నబీన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబీన్ రాష్ట్రానికి రానున్నారు. జూన్ మొదటి వారం లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ క్రమంలో ఈ సమా వేశానికి ముఖ్యఅతిథిగా నితిన్ నబీన్ హాజరు కానున్నారు. పది జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.