23 May, 2026 | 2:52 AM

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల లాంటివి

23-05-2026 02:14 AM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి, మే 22 (విజయక్రాంతి): అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వంలో రెండు కళ్ళలాంటివని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యచరణలో పాల్గొని ఆయన మాట్లాడారు. రైతులు లాభసాటి పంటలు పండించేలా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం నలభై లక్షలు టన్నులు పండితే సరిపోయేది అని రెండు కోట్ల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండుతుందన్నారు. వాటిని నిల్వ చేయడానికి గోదాములు లేవు అని, లారీలు సరిపడలేవని, అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోచారం తెలిపారు.

రైతులు పంటలు పండించడంలో అధిక దిగుబడులతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే పంటలను పండించాలన్నారు. పంట మార్పిడి విధానాన్ని రైతుల అవలంబించే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పామాయిల్ తోటలు పెంచాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిర్మాణాలు పూర్తిచేసుకుని తమ సొంతింటి కలను లబ్ధిదారులు సహకారం చేసుకునే విధంగా అధికారులు బిల్లులను వెంటవెంటనే ఇప్పించి ఇంటి నిర్మాణం పనులు పూర్తిగా జరిగేలా కృషి చేయాలన్నారు.

క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఇంది రమ్మ ఇండను మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, కామారెడ్డిలో పాల్గొనగా, నిజామాబాదులో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, కామారెడ్డి కలెక్టర్ సంగు  వాన్, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్య క్రమం కార్యక్రమం లో చేపట్టిన కార్యక్రమాలు వివిధ శాఖల అధికారుల ప్రోగ్రెస్ ను వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పలువురు విద్యార్థు లకు మెమెంటోళ్లు, సన్మానాలు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.