calender_icon.png 6 October, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగ ఓట్లతో దొడ్డి దారిన బీజేపీ అధికారంలోకి వస్తోంది

06-10-2025 12:18:34 AM

  1. ఇందిరా చౌక్ నుండి సంతకాల సేకరణ ప్రారంభించాం 

ఈ నెల 17 లోపల అన్ని డివిజన్లలో సంతకాల సేకరణ జరుగుతుంది 

సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

ముకరంపుర,అక్టోబర్5(విజయక్రాంతి):దేశ వ్యాప్తంగా నమోదు చేసుకున్న దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం కళ్లు తెరవాలని సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఇందిరా చౌక్ వద్ద కొత్త 64 వ డివిజన్ నుండి సంతకాల సేకరణ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఓటు చోరీని అరికట్టడంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 17 తారీఖు లోపల అన్ని డివిజన్లలో డివిజన్ల అధ్యక్షులు ఇంచార్జులు సంతకాల సేకరణ చేయాలని ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్యనాయకులు పాల్గొంటారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యేంతవరకు ఇలాంటి కుట్రలను తిప్పి కొడుతామని ఓటు చాలా విలువైనదని బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని నరేందర్ రెడ్డి అన్నారు.డివిజన్ బాద్యుడు పెద్దిగారి తిరుపతి ఆధ్వర్యంలో 64 డివిజన్ కు సంబంధించిన పి.పద్మ,కోమలత, మనీషా,ఆరిఫ్,వెన్నెల,సోహెల్ శివాని తదితరులు పత్రాల పై సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ర హ్మత్ హుస్సేన్,కొరివి అరుణ్ కుమార్,బోనాల శ్రీనివాస్,అబ్దుల్ రహేమాన్,అహ్మద్ అలీ, గుం డాటి శ్రీనివాస్ రెడ్డి,ఎండి చాంద్,దండి రవీందర్,కుర్ర పోచయ్య,నెల్లి నరేష్,యనమల మం జుల,షబానా మహమ్మద్,ముల్కల కవిత,ఊరడి లత,హసీన,జ్యోతి రెడ్డి,వంగల విద్యా సాగర్,సలీం,సుదర్శన్,నాగుల సతీష్,మాదాసు శ్రీనివాస్,బత్తిని చంద్రయ్య,మహమ్మద్ భారీ,షెహెన్ష తదితరులుపాల్గొన్నారు.