calender_icon.png 6 October, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం

06-10-2025 12:17:28 AM

-ట్యాంక్‌బండ్‌పై నెలకొన్న సందడి 

-మేళతాళాలు, కోలాటాలతో మార్మోగిన పరిసరాలు 

-పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి ): శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న అమ్మవార్లను గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు భారీ ఊరేగింపులతో తరలివచ్చారు. ముఖ్యంగాహుస్సేన్‌సాగర్‌లోని పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం ఉదయం నుంచి సందడి వాతావరణం నెలకొంది.

మేళతాళాలు, కోలాటా లు, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు తీసుకొ చ్చారు. భక్తుల జై బోలో దుర్గా మాతా కీ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివ చ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిటకిటలాడాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ నగరం వ్యా ప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేసింది.

ఆదివారం గ్రేటర్ పరిధిలో మొత్తం విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు జీహెఎంసీ అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా, ఒక్క పీపుల్స్ ప్లాజా వద్దనే  విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని కేంద్రాల్లోనూ ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా, సాఫీగా సాగిందని అధికారులు వివరించారు.