calender_icon.png 1 May, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తోంది

29-04-2025 12:00:00 AM

 ఆమనగల్లు,ఏప్రిల్ 28 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను  కాలరాస్తుందని... ప్రజలంతా గమనించి బిజెపికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే కాసిరెడ్డి నారా యణరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం అమనగల్లు మండలంలోని మాలపల్లి గ్రామంలో  జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి గ్రామంలో పలు వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందని.. కాంగ్రెస్ పాలల్లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన గుర్తు చేశారు.

కేంద్రంలో ఉన్న బిజెపి రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తుందని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనల్లో ఆరు గ్యారంటీలు అర్హులైన అందరికీ అందుతాయని ఆయన చెప్పారు. అనంతరం ఆమనగల్ మండలం కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను ఇబ్బందులు గురి చేయకుండా  తురతి గతిన ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జగన్, ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసి జంగయ్య,మాజీ వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి,మాజీ సర్పంచులు శ్రీనివాస్, రమణారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శ్రీశైలం, నాయకులు మైసయ్య, కృష్ణ నాయక్,ఎన్ ఎస్ యు నాయకులు  తదితరులు పాల్గొన్నారు.