1 July, 2026 | 10:45 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఫారెస్టు భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించిన బీజేపీ నేత అరెస్టు..

21-06-2025 10:31 PM

వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్ రెడ్డి..

అదిలాబాద్ (విజయక్రాంతి): ఫారెస్ట్ భూమిని తనదంటూ లేఔట్ చేసి ప్లాట్లుగా విక్రయించిన బీజేపీ నేత వకుళభరణం అదినాథ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి(DSP Jeevan Reddy) వివరాలు వెల్లడించారు. వకుళభరణం అదినాథ్ అతని భార్య రజినిలు 2010 సంవత్సరంలో ఖానాపూర్ శివారులోని ఫారెస్ట్ భూమిని తన పేరుతో ఉందంటూ నమ్మించి ప్లాట్లు చేసి విక్రయించగా అందులో నాలుగు ప్లాట్లులను ఒక్కొక్కటి 3 లక్షల 30 వేలకు విక్రయించారన్నారు.

కాగా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు అమ్మారని తెలుసుకున్న బాధితులు పోలీసులనాశ్రయించారు. దీంతో బాధితురాలు శోభ మురార్ఖర్ ఈనెల 19న మావల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టగా ఫారెస్ట్ అధికారులు సైతం ఆ భూమి అటవీ భూమి అని ధృవీకరించారని తెలిపారు. కాగా వకుళభరణం ఆదినాథ్ ను అరెస్టు చేసి న్యాయమూర్తి హాజరుపర్చగా, 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు  పంపడం జరిగిందని తెలిపారు. భార్య రజిని పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.