1 July, 2026 | 11:43 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాకు రామ్ రామ్..

21-06-2025 10:34 PM

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి గోపాల్ పేట,రెవల్లి,ఎదుల మండల నాయకులతో సమావేశం..

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

వనపర్తి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రైతు భరోసాకు కాంగ్రెస్ పార్టీ రామ్ రామ్ పలుకుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) అన్నారు. శనివారం  జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉమ్మడి గోపాల్ పేట మండలం ముఖ్యనాయకుల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనివార్యం అని అన్నారు. అందుకే బి.ఆర్.ఎస్ శ్రేణులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. రేపటి నుండి మండలాల ముఖ్యనాయకులు గ్రామాలలో పర్యటించి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఎట్లా తూట్లు పొడిచింది అని వివరించండి అదేవిధంగా మన శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన 420హామీలు, 6గ్యారంటీలు  అమలు చేయడంలో విఫలమై ప్రజలలో చులకన అయ్యిందని ఎన్నికల అంతరం గ్యారంటీగా రైతు భరోసా ఎత్తివేస్తారని జోస్యం చెప్పారు. ప్రజలలో కె.సి.ఆర్ పట్ల,బి.ఆర్.ఎస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎన్నికలలో  పోరాడాలని అన్నారు. పార్టీ పట్ల నిబద్ధత,నాయకుణ్ణి పట్ల విధేయత ప్రజల పట్ల విశ్వాసంతో పనిచేసిన నాయకులను అభ్యర్థులుగా నియమించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలలో నాయకులు,కార్యకర్తలు ఏవిధంగా వ్యవహరించి ప్రజలకు చేరువ కావాల్సిన వ్యూహాల గురించి ఆయన వివరించి ఎన్నికలకు సిద్ధం చేశారు. గ్రామాలవారిగా నాయకుల అభిప్రాయాలు స్వీకరించి వాటికి సూచనలు చేశారు.

ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు,శివరాం రెడ్డి,మాజీ జెడ్పిటీసి భీమన్న,మాజీ ఎం.పి.పిలు సంధ్య తిరుపతయ్య,సేనాపతి,మాజీ సర్పంచులు రమేష్,శేఖర్,హర్యానాయక్,మతీన్,బంకల.స్వామి,చిట్యాల.రాము,శ్రావణ్ కుమార్ అన్ని గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.