22 April, 2026 | 2:03 AM

సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత

22-04-2026 12:52 AM

జూబ్లీహిల్స్,ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరిం చుకుని బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి శ్రీమతి డాక్టర్ పద్మ వీరపనేని ఆయనను మర్యాదపూర్వకముగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర అభివృద్ధి పథంలో ఆయన నాయకత్వం మరింత పటిష్టంగా కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు అనుభవం, దార్శనికత రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా కొనియాడారు.