బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
22-04-2026 12:51 AM
రాజాపూర్ ఏప్రిల్ 21: రాజాపూర్ మండలంలోని కుత్నేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప సర్పంచ్ మణెమ్మ బంద్యా నాయక్, కాంగ్రె స్ పార్టీ గ్రామ అధ్యక్షులు రూప్ సింగ్, కాం గ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు తిరుమలేష్, ఇందిరమ్మ కమిటి సభ్యులు శ్రీను నాయక్, వెంకటేష్, దూల్య నాయక్ మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బిఅర్ఎస్ పార్టీ యువనాయకుడు చించోడ్ అభిమన్యు రెడ్డి గులాబీ కండువా కప్పి బిఆర్ ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సేవ్యనాయక్, మాజీ వార్డు మెంబెర్స్ రాంసింగ్, శేఖర్, ప్రవీణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.






