22 April, 2026 | 2:06 AM

ఐఐటీ- జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రభంజనం

22-04-2026 12:53 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 21(విజయక్రాంతి): సోమవారం రోజున వెలువడిన మెయిన్స్ 2026 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్ధులు జాతీయ స్థాయిలో అద్భుత రాంక్యులు సాధించారని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తెలిపారు. వివిధ కేటగిరీలలో యం. సిరిచందన - 143, టి. సాయి సిరి - 164, యం . శ్రీసంజన - 1008, కె. అభినవ్ - 1141, కె. నిఖిల్ - 2010, వి. కీర్తన - 5699, సి హెచ్ కీర్తన - 7074, యం.శ్రీరాం రెడ్డి - 14515, భూక్య శ్రీవిద్య - 15870, గుగ్లవత్ యోగేశ్వర్ - 17557, గుగ్లవత్ పల్లవి - 19745 ఆల్ ఇండియా సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ, జెఈఈ-మెయిన్స్ కు హాజరైన విద్యార్థుల్లో 50% మంది ఐఐటి అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని అన్నారు.

మెయిన్స్ నుండి అడ్వానస్డ్ వరకు అధ్యాపకులు నిరంతరం మార్గనిర్దేశం చేస్తున్నారని, రాబోయే అడ్వాన్స్ పరీక్షల్లో చైతన్య విద్యార్ధులు మంచి ర్యాంకులు సాధించి ఐఐటీలో సీట్లు సాధిస్తారని రమేష్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి,  జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎజియం  శ్రీనివాస్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.