బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటిపైన జెండా ఎగరవేసిన బీజేపీ నేత
06-04-2026 02:14 AM
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 5 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన ఇంటి పైన బిజెపి జెండా ఎగరవేసినట్లు మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది నాయకుల త్యాగ ఫలితమే కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ నీతి నిజాయితీతో రైతు పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు సానుభూతిపరులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినట్లు మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ బిజెపి మాజీ కౌన్సిలర్ అమరం సరస్వతి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.




