26 March, 2026 | 11:51 AM

Breaking News

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భాంతి.. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది సజీవదహనం   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •   ఎంతమందిని తొక్కుతవ్!   •   రాజకీయ నాయకుల్లో.. పునర్విభజన కాక!   •  

నాంపల్లి కోర్టుకు హాజరైన బీజేపీ నేత ప్రభాకర్

05-11-2024 12:30 PM

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ప్రభాకర్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీపాదాస్ పై గతంలో బీజేపీ నేత ప్రభాకర్ ఆరోపణలు చేశారు. పరువు నష్టం కేసు విషయమై దీపాదాస్ మున్షీ మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు పోస్టులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించడానికి దీపాదాస్ మున్షీ బెంజ్ కారు, ముడుపులు తీసుకున్నారని ప్రభాకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరోపణలు చేశారు. దీంతో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2024 జూన్ 7న దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు పరిహారం ఇప్పించాలని నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కారు. కాగా, అక్టోబర్ 25న కోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టింది. కానీ ప్రభాకర్ ఆరోజు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణకు ఖచ్చితంగా రావాలంటూ ఆదేశించింది. దీంతో ఇరువురు నేతలు ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.