25-08-2025 01:09:01 AM
కరీంనగర్, ఆగస్టు 24 (విజయక్రాంతి): కులం, మతం లేనిదే బీజేపీ నేతలకు పూట గడవదు అని, ఎన్నికలు రాగానే హిందూ, ముస్లిం గొడవలు గుర్తు చేస్తూ మత రాజకీయాలు చేస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం గం గాధర మండలంలో ఆదివారం ఉప్పర మ ల్యాల నుంచి మధుర నగర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర నిర్వహించారు.
ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి మహేశ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారురాలు భాగ్యమ్మ కళ్లలో ఆనందం చూసినప్పుడు మనసు ఉప్పొంగిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే డబుల్ బెడ్ రూమ్ కల నెరవేరిందని, 40 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామని గుర్తు చేశారు. ఎన్నికలు రా గానే హిందూ, ముస్లిం గొడవలు గుర్తుకు తెచ్చుకోవడం బీజేపీ నేతలకు అలవాటని వి మర్శించారు.
కులం, మతం ప్రస్తావన లేనిదే బీజేపీ నేతలకు పూట గడవదని, దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని మండిపడ్డారు. కొండగట్టు అంజన్న పేరుతో ఓట్లు అడగడం ప్రజాస్వామ్యానికి అవమానమని దుయ్యబట్టారు. తెలంగాణలో గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్ల సహాయంతో గెలిచారన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. రాహుల్‌గాంధీ బయటపెట్టిన ఓటర్ జాబితా చూస్తే అది స్పష్టమవుతుందని చెప్పారు. బండి సంజ య్ నిజమైన బీసీ నాయకుడు కాదని అన్నా రు.
మున్నూరుకాపు సమాజానికి చెందిన బండి సంజయ్.. ఢిల్లీలో కిషన్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నాడని విమర్శిం చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయమై ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఢిల్లీలో దాక్కున్నాడని మండిపడ్డారు. దొంగ ఓట్ల సహాయంతో మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని, వెంటనే పదవి నుంచి దిగిపోవాలని మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాం డ్ చేశారు. వోట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ చేపడుతున్న ర్యాలీలకు విశేష ప్రజాదరణ లభిస్తోందని అన్నారు.
జనహిత పాదయాత్రకు అనూహ్య స్పందన
గంగాధర(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు గంగాధర మండలం ఉప్పరమల్యాల కురిక్యాల గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం గంగాధర మండలం లోని ఉప్పర మల్యాల గ్రామంలో రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, అ డ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు జనహిత పాదయాత్రలో పాల్గొన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ను ఆవిష్కరించి జనహిత పాదయాత్రలో పాల్గొన్నారు.
ఉప్పర మల్యాల గ్రామం నుం డి సాగిన జనహిత పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు ప్రజల సమస్యలను తెలు సుకుంటూ ముందుకు సాగారు. మహిళలు నెత్తిన బోనాలు, కోలాటం ఆడుతూ, ఒగ్గు కళాకారులు ఒగ్గుడోలు ప్రదర్శన నిర్వహిస్తూ యాత్రలో పాల్గొన్నారు. కురిక్యాల గ్రామంలో మహిళలు మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళ హారతులతో స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు.
కాంగ్రెస్‌తో సామాజిక న్యాయం: మీనాక్షి నటరాజన్
కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అందిస్తూ ప్రజల ప్రేమాభిమానాలను పొందుతుందన్నారు. దేశంలో రెండు భిన్నమైన రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయని, అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. దోచుకునే వారికి మద్దతిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం చేస్తూ పేద ప్రజల పక్షాన పనిచేస్తున్నదని చెప్పారు.
సోనియా గాంధీ నేతృత్వంలో గతంలో యూపీఏ సర్కార్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా దేశానికి భద్రత అందించిందని గుర్తు చేశారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించారని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నారని తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్ విప్ ఆదిశ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మక్కాన్ సింగ్, ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్ రావు పాల్గొన్నారు.