25-08-2025 12:48:44 AM
-42 బీసీ రిజర్వేషన్లపై స్పష్టత కరువు
-పార్టీ ముఖ్య నేతలకు చుట్టూ మద్దతు కోసం అభ్యర్థుల క్యూ
-అధికార పార్టీపై పెన్షన్ రుణం బకాయిదారుల కోపం
-బలహీనంగానే ప్రధాన ప్రతిపక్షాలు
నిర్మల్ ఆగస్టు 24 (విజయ క్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. పల్లెల్లో లీడర్లుగా ఎదగడానికి రాజకీయ ప్రాబల్యమున్న మద్దతు ధరలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటినుండి తాము పోటీ చేస్తున్నట్టు ప్రకటించుకుని గ్రామాల్లో రచ్చబండ చర్చలు ప్రారంభించారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికలు జరగడంతో అధికార పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ మద్దతు ధరలను గెలిపించుకోవాలని అన్ని జిల్లాల పార్టీ నాయకత్వాన్ని కోరుకుంది.
గత ఎన్నికల్లో ఓడిపోయిన బిఆర్‌ఎస్ బిజెపి పార్టీ కూడా స్థానిక సంస్థల్లో ఎక్కువ గెలిచి తమ చాటుకోవాలని సత్తా ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తుంది. నిర్మల్ జిల్లాలో 18 మండలాలు ఉండగా నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలో స్థానిక సంస్థలైన 400 గ్రామపంచాయతీలు 156 ఎంపీటీసీ స్థానాలు 18 జడ్పిటిసి స్థానాలు., మూడు మున్సిపాలిటీలు, 96 వార్డ్ కౌన్సిల్ స్థానాలు ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు వీటన్నిటికీ నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇప్పటికీ సర్పంచుల పదవీకాలం ముగిసి 18 నెలలు కాగా జెడ్పిటిసి ఎంపిటిసి మున్సిపల్ పాలకవర్గ ముగిసి ఏడాది దాటిపోయింది. రాష్ర్టంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ ఎన్నికలు కావడంతో అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూకుడుగా ప్రవర్తిస్తూ అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు గెలిపి లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తుంది. ఆయా జిల్లాలకు జిల్లా ఇన్చార్జిల నియమించి సెట్టింగ్ ఎమ్మెల్యే తో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు డిసిసి అధ్యక్షులు మండల కేడర్ తో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చర్యలు చేపట్టింది
రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత కరువు
రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే బీసీ కులగలను చేపట్టి 42 శాతం బీసీలకు సీట్లు కేటాయిస్తామని ప్రకటిస్తూ చట్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ఈ ఎన్నికల్లో చట్టబద్ధంగా అమలు అయ్యే అవకాశం లేదు.
అయితే చట్టబద్ధత కాకపోయినప్పటికీ పార్టీ పరంగా బీసీలకు 42 సీట్లు కేటాయించి ప్రతిపక్షాలపై ఒత్తిడి తేవాలని పార్టీ రాష్ర్ట కమిటీ సమావేశంలో తీర్మానం చేయడం బీసీలకు అత్యధిక సీట్లు వస్తాయని ఆశావాదులు ఎదురుచూస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో కొనసాగించిన రిజర్వేషన్లు అమలు చేస్తారా కొత్త రిజర్వేషన్లు మారుస్తారని అంశంపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు కూడా రిజర్వేషన్ల ప్రక్రియను పక్కకు పెట్టి బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు వ్యూహం పన్నుతున్నారు. జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా నిర్మల్ లో బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ముధోల్ లో ఆ పార్టీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఖానాపూర్ లో అధికార పార్టీ అభ్యర్థి వేడుమ బోజ్జు పటేల్ పటేల్ ప్రాతినిత్యం వహిస్తున్నారు.
టిఆర్‌ఎస్ పార్టీ విషయానికి వస్తే పార్టీకి ఎమ్మెల్యేలు రాతి నెత్తిన లేకపోగా గ్రామస్థాయిలో ఉన్న క్యాడర్ మొత్తం కాంగ్రెస్ బిజెపి వైపు మొగ్గు చూపడంతో కొందరు లీడర్లు మాత్రమే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఖానాపూర్ లో ఓడిపోయిన అభ్యర్థి జాన్సన్ నాయక్ నిర్మల్ లో మాజీ జెడ్పి చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, ముధోళ్ళు లోలం శ్యాంసుందర్ కిరణ్ కారే రమాదేవి టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం తమ మద్దతు ధరలను ఎన్నికల బరిలో దింపేందుకు కార్యచరణ రూపొందించుకున్నారు. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ లో ప్రతి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి.
నిర్మల్లో డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోళ్ లో మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి, ఖానాపూర్ లో సెట్టింగ్ ఎమ్మెల్యే వేడుమ బుజ్జు పటేల్ పటేల్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ రెండు గ్రూపులుగా విడిపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి వారి మద్దతుదారులను గెలిపించుకునేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికి తోడు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ గారి నిర్మల్ నియోజకవర్గాలపై తమ పట్టు సాధించే విధంగా రాష్ర్ట మంత్రాలు చేస్తున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత పార్టీలకు ఆదరణ కరువే
నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యే ఎన్నికలు 18 నెలలు గడుస్తున్న సెట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రకటించి అందులో కొన్ని పథకాలను అమలు చేసినప్పటికీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ పెన్షన్ల పెంపు పై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నది. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం నిధుల కొరత కారణంగా అభివృద్ధి జరగకపోవడంతో సెట్టింగ్ ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉంది, నిర్మల్ నుంచి గెలుపొందిన బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి పై కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
ఆ పార్టీ నాయకులు ఆయనపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా స్థానికంగా ఉండకపోవడం ప్రజల సమస్యలను పరిష్కరించకపోవడం సీనియర్ నేతలను విస్మరించడంతో మహేశ్వర్ రెడ్డి పై కేడర్ తో పాటు యువకులు కూడా బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీలో పని చేస్తున్న ముఖ్య నేతలు జూనియర్ సీనియర్లుగా విడిపోయి ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో అసలైన కార్యకర్తలు ఎవరికి మద్దతు పలకాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతున్నారు.
ముధోల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే పై అంత వ్యతిరేకత లేనప్పటికీ ఒక రెండు వర్గాలు మాత్రమే ఆయన ప్రోత్సహిస్తున్నారని మిగతావారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో బిజెపి మద్దతుదారులు ఆ పార్టీని విడి అధికార కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తేనే తమ రాజకీయ ఉనికి ఉంటుందని భావిస్తున్న గ్రామీణ లీడర్లు పార్టీ ముఖ్య నేతల మద్దతు కోసం కృషి చేస్తూనే గ్రామాల్లో వారి వారి అనుచర గణాన్ని ఎన్నికలకు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.
హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికల నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ఆ దిశగా ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు మూడు పార్టీలకు రెఫరెండగా కావడంతో తమ మద్దతు దారులను గెలిపించుకునేందుకు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా శమటోడ్చి కష్టపడి పని చేయాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అయితే గత ఎన్నికల్లో గెలుపొందిన తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు మున్సిపల్ చైర్మన్లు తిరిగి మరొకసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహాన్ని సూపుతున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఆ పార్టీలో కష్టపడి పనిచేసిన పార్టీ ముఖ్య కార్యకర్తలు కూడా ఈ అవకాశాన్ని సద్విని చేసుకుని తమ రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు ఎన్నికల దోహదపడతాయని భావిస్తూ పల్లె ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంత ఓటర్లు మాత్రం ఏ పార్టీ ముగ్గు ఊపుతారోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు