calender_icon.png 25 August, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియా పదునైన ఆయుధం

25-08-2025 01:13:28 AM

- బీజేపీ బలోపేతానికి, సమాజాభివృద్ధికి వినియోగించాలి 

- స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి 

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 

- ఎల్బీనగర్ లో బీజేపీ సోషల్ మీడియా, ఐటీ విభాగాల వర్క్ షాప్

- హాజరైన ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ 

ఎల్బీనగర్, ఆగస్టు 24 : దేశమంతా బీజేపీ వైపు చూస్తుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు ఈటల రాజేందర్, కె.లక్మణ్ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమన్నారు. సోషల్ మీడియా పదునైన ఆయుధమని, దానిని బీజేపీ బలోపేతానికి, సమాజాభివృద్ధికి వినియోగించా లని సూచించారు.

బీజేపీని విమర్శిస్తూ బీసీ రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. ఎల్బీన గర్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో బీజేపీకి చెందిన సోషల్ మీడియా, ఐటీ విభాగాల ప్రతినిధులకు ఆదివారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు ఈటల రాజేందర్, కె.లక్మణ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ గురించి సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం ఎవరు చేస్తున్నారో గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా పనిచేసే పని చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నదని ఆరోపించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ యోజన రైతులందరికీ వస్తున్నదని, మరి రాష్ట్రంలో రైతుబంధు మాత్రం అందరికీ ఇవ్వడం లేదని విమర్శించారు. పార్టీ అంతర్గత విషయాలను తప్పుగా రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, గెలిచాక ఇవ్వకపోవడం దుర్మార్గ చర్యగా భావిస్తున్నామని తెలిపారు.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సమాచార వ్యాప్తిలో సోషల్ మీడియా, ఐటీ, మీడియా పాత్ర చాలా ము ఖ్యమైనవి అన్నారు. అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది సో షల్ మీడియానే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి, వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే సమర్థవంతమైన యోధులని అన్నారు. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిదని, అది శత్రువుపై ప్రయోగించాలి తప్పా, మనలో మనమే విభజన చేసు కోవడానికి వాడకూడదని సూచించారు.

సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబై ల్ ఫోన్, వారి మెదడు ఎఫెక్టివ్గా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయ తీ వ్యవస్థలన్నీ సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రా మ స్వరాజ్యం సిద్ధిస్తుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థ ల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రా ష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి భ యంతో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. ప్రజలు ఇప్పటికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని చీకటి అన్యాయాలను మరిచిపోలేదన్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలంద రూ చౌరస్తాలో ఉన్నారని, వారికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత సోషల్ మీడి యా, మీడియా మీదే ఉందని సూచించారు. గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనా లు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయని తెలిపారు. కానీ సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఇప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటున్నాయని విమర్శించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. 

అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని, ఇందు కోసం మీరందరూ ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.బీజేపీ సోషల్ మీడియా జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లాజీ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయని, ఇందులో విజయం సాధించాలన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడి యా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరా రు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముం దు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేద ని, ఇట్టి విషయాన్ని బిజెపి మీడియా, సో షల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలలోకి తీ సుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో కాం గ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని, అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైన వ్యక్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల పేరుతో, అందులో 10% ముస్లింలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని, దీనిని బీజేపీ అడ్డుకుంటుందని తెలిపారు. వర్క్ షాప్ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, వివిధ వి భాగాల అధ్యక్షులు, ప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్‌పాల్గొన్నారు.