స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి
కోల్‌కతా: స్కూల్ పిల్లల భద్రతకు దిక్కులేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం రైలు ఢీకొట్టిన ఘటనలో, తాము ప్రయాణిస్తున్న పూల్ కారులోని ఇద్దరు పాఠశాల విద్యార్థులతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కర్ణ సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవల్-క్రాసింగ్ గేట్ వద్ద ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ఈస్టర్న్ రైల్వే అధికారి పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న పూల్ కార్, కట్వాకు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణ సుబర్ణ స్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద రైలు పట్టాలను దాటుతుండగా, స్థానిక రైలు ఆ వాహనాన్ని ఢీకొట్టింది.
ప్రమాదానికి గల కారణాన్ని దర్యాప్తు చేయడానికి 10 మంది సభ్యుల బృందాన్ని ఉన్నతాధికారులు హుటాహుటిన ఆ ప్రదేశానికి పంపించారు. ప్రమాదం జరిగినప్పుడు లెవల్ క్రాసింగ్ గేటు తెరిచి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ ప్రమాదం కారణంగా తూర్పు రైల్వే హౌరా డివిజన్‌లోని అజిమ్‌గంజ్-కట్వా విభాగంలో రైలు సేవలకు అంతరాయం కలిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ






