మోదీ సభకు తరలివెళ్లిన పాలకవీడు బీజేపీ నాయకులు
11-05-2026 12:50 AM
పాలకవీడు, మే 10: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు పాలకవీడు మండలం నుంచి బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నరి నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు బస్సుల్లో, కార్లలో తరలివెళ్లారు.ఈ సందర్బంగా నరి నాయక్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటమే ధ్యేయంగా నరేంద్ర మోడీ పర్యటన జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విజయభాస్కర్ రెడ్డి, వెంకటశ్వర్లు శేషగిరి రావు, లాజర్, శ్రీను, ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.






