29 June, 2026 | 3:06 PM

Breaking News

అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం

11-05-2026 12:49 AM

ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

మిర్యాలగూడ, మే 10 : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పారదర్శకత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలనలో రాజకీయాలకతీతంగా అర్హత గల వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో 21 మంది లబ్ధిదారులకు సుమారు పది లక్షల విలువ చేసే  ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి  కుటుంబాలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.