11 May, 2026 | 1:59 AM

ఎమ్మెల్యే పద్మావతికి ధన్యవాదాలు తెలిపిన

11-05-2026 12:52 AM

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సులోచనరావు

కోదాడ మే 10: కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమించబడిన కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన పులి సులోచనరావు ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి, తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే పద్మావతిరెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లిక్కి గురవమ్మ వెంకటయ్య, పులి వెంకటేశ్వర్లు, తూమాటి నాగిరెడ్డి, పూర్ణ, కలకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.