11 May, 2026 | 1:56 AM

రవాణా సౌకర్యం కోసం రాష్ట్ర మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

11-05-2026 12:53 AM

చేగుంట మే 10: చేగుంట మండలం లోని చందాయిపేట్, ఇబ్రహీంపూర్, పొలంపల్లి, అన్నంతసాగర్ పొలంపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆదివారం రోజు హైదరాబాద్ లో మంత్రి నివాసంలో రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర రవాణా శాఖ,, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి తమ గ్రామం నుండి చేగుంటకు, తూప్రాన్ కు వెళ్లే విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలని, అలాగే పొలంపల్లి గ్రామంలో బస్టాండ్ నిర్మించాలని మంత్రివర్యులకు తెలపగా వెంటనే సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ ఉపసర్పంచ్ చౌదరి శ్రీనివాస్,పొలంపల్లి గ్రామ అధ్యక్షులు కర్రే స్వామి, వెంకటేశం పాల్గొన్నారు.