29 May, 2026 | 7:45 PM

తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపిన బిజెపి నాయకులు

29-05-2026 05:05 PM

రుద్రంగి మే 29(విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బిజెపి పార్టీ నాయకులు తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కర్ణవత్తుల వేణు మాట్లాడుతూ.ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.4వందల బస్తాలు పండించే డబ్బున్న రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారని సన్నకారు నిరుపేద రైతుల ధాన్యం కొనుగోలు చేయడం లేదని డబ్బున్న వారివైపే కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని నిరుపేద రైతులకు మొండిచేయి చూపిస్తుందని మరోసారి రుజువైందని అన్నారు.ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలు మరి రైతుల ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.బిఆరెస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నాది కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనకుండా రైతుకు ఉరిశిక్ష విదిస్తుందని అన్నారు.వడ్ల కల్లాలు ఉండవు కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకార్యాలు ఉండవు ధాన్యం సరైన సమయానికి కొనరు మరి ఇది ఎలా ప్రజా పాలన అవుద్దీ అని ఎద్దేవా చేశారు

నిత్యం గ్రామానికి వస్తున్న ఎమ్మెల్యే కు రైతుల బాధలు కనిపించడం లేద అని ప్రశ్నించారు.కనీసం కాంగ్రెస్ నాయకులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన దాఖలాలు లేవని రైతుల బాధలు కాంగ్రెస్ నాయకులు పట్టించుకోరని వారికి కావాల్సింది రైతుల ఓట్లు మాత్రమే అని అన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.కొనుగోలు కేంద్రాల సిబ్బంది కూడ మద్యానికి డబ్బుకు లొంగి సీరియల్ ప్రకారం వడ్లు జోకడం లేదని అన్నారు.ప్రజలు రైతులు ఆలోచించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో,ఉప అధ్యక్షుడు గండి శ్రీనివాస్, అల్లూరి రవీందర్,భూక్య నరేష్,దేగవత్,గంగాధర్, లావుడ్యా శ్రీనివాస్,తల్లపెళ్లి బాలకిషన్ రావు, నేవురి కిషన్,అక్కినపెళ్లి నర్సింగరావు,గెంటే మల్లయ్య,బాసాని దాయనంద్,పండుగ గంగాధర్, గసికంటి వెంకటి,పాల్గొన్నారు.