calender_icon.png 28 September, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాతని దర్శించుకున్న బీజేపీ నాయకులు

28-09-2025 10:20:47 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని బీజేపీ యువ నాయకులు దార రవి సాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో ప్రతిష్టించిన అమ్మవారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ లు దర్శించుకున్నారు. ఆదివారం ఏడవ రోజు అమ్మవారు చండీ మాతా అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ బీజేపీ యువ నాయకుడు రవి సాగర్ ప్రతి సంవత్సరం దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

దుర్గాదేవి ఆశీస్సులు పట్టణ ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆయన అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు అందుగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు అక్కల రమేష్, పట్టి వెంకటకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రావు, సీనియర్ నాయకులు డివి దీక్షితులు, రూరల్ అధ్యక్షులు జనార్దన్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోతునూరి రాజేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కర్రావుల వినయ్, పట్టణ ఉపాధ్యక్షుడు శనిగారపు శ్రీనివాస్, కార్యదర్శి దుర్గం సత్యంబాబు, ప్రియాంక, మంగ, శ్రీ లలిత, రజిత, సంధ్య, ప్రవీణ్, మల్లేష్ లు పాల్గొన్నారు.